Friday, April 1, 2011

 
ఒకే గొడుగు, ఒకే అడుగు, ఒకే నడకగా
ఒకరికొకరుగా, ఒకేఒకరుగా
కలిసి పయనించే స్నేహము
వలపు వర్షించే మేఘము

ఆ:
నీలి మబ్బు మెరిసి మెరిసి
నీళ్ళ మనసు మురిసి మురిసి
ఎన్ని జలదరింపులో
ఎన్నెన్ని పులకరింతలో
అ:
చినుకు చినుకు కలిసి కలిసి
చెలిమి జల్లు కురిసి కురిసి
ఎన్ని వలపు వరదలో
ఎన్నెన్ని కలల వాగులో
ఆ:
ఇది భూదేవికి సీమంతం
అ:
అనురాగానికి వసంతం

అ:
కన్నె తీగ తడిసి తడిసి
వన్నె మొగ్గ తొడిగి తొడిగి
ఎన్ని పూలపొంగులో
ఎన్నెన్ని రంగవల్లులో
ఆ:
ఇంద్రధనస్సు పందిరేసి
రంగులేడు ముగ్గులేసి
ఎన్ని మధనపూజలో
ఎన్నెన్ని మరులవిందులో
అ:
ఇది ఈ సృష్టికి ఆనందం
ఆ:
ఇది మన ఇద్దరి అనుబంధం

సినిమా:- అభిమన్యుడు
సాహిత్యం:- ఆత్రేయ
సంగీతం:- మహదేవన్
గానం:- బాలు, సుశీల

okE goDugu, okE aDugu, okE naDakagA
okarikokarugA, okEokarugA
kalisi payaninchE snEhamu
valapu varshinchE mEghamu

A:
neeli mabbu merisi merisi
neeLLa manasu murisi murisi
enni jaladarinpulO
ennenni pulakarintalO
a:
chinuku chinuku kalisi kalisi
chelimi jallu kurisi kurisi
enni valapu varadalO
ennenni kalala vAgulO
A:
idi bhoodEviki seemantam
a:
anurAgAniki vasantam

a:
kanne teega taDisi taDisi
vanne mogga toDigi toDigi
enni poolapongulO
ennenni rangavallulO
A:
indradhanassu pandirEsi
rangulEDu muggulEsi
enni madhanapoojalO
ennenni marulavindulO
a:
idi ee sRshTiki Anandam
A:
idi mana iddari anubandham

sinimaa:- abhimanyuDu
saahityam:- AtrEya
sangeetam:- mahadEvan
gAnam:- bAlu, suSeela

Labels: , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]