Friday, April 1, 2011

 
పెద్దవీధి చిన్నవీధి ఇరుకువీధి మెరకవీధి
అన్ని వీధులు ఊరివేరా
పొట్టివాడు పొడుగువాడు ఉన్నవాడు లేనివాడు
అన్ని రూపులు మనిషివేరా
ఊరిఊరికి బేధముందిరా
మనిషిమనిషికో మర్మముందిరా
ఆచితూచి ఈ జగాన అడుగు ముందుకు వేయ్యరా

కష్టమొచ్చినా నష్టమొచ్చినా చెదిరిపోనిది ఈ బంధమేనురా
రెచగొట్టినా రచ్చకీడ్చినా బెదిరిపోనిది ఈ స్నేహమేనురా
చిన్ననవ్వుతో లొకాన్ని గెలుచుకో
ఉన్నదానితో స్వర్గాన్ని మలచుకో
కలిమిలో పొంగకు లేమిలో కుంగకు
భాయి
నిన్నుగన్న ఊరిపేరు మరచిపోకు నేస్తమా

మనసు నమ్మిన మార్గమెంచుకో
ముక్కుసూటిగా సాగిపోరా
మాయ అద్దమే పాడులొకము
ముందుచూపుతొ మసలుకొరా
పూలతోటలో విషనాగులుండవా?
లేళ్ళచెంతనే తొడేళ్ళు ఉండవా?
పిడుగులే రాలినా అడుగులే సాగని
భాయి
లక్ష ముళ్ళకంటే ఒక పువ్వు మేలు మిత్రమా

సినిమా:- వాలుజడ తోలుబెల్టు
సాహిత్యం:- భువనచంద్ర
సంగీతం:- ప్రసన్న సర్రాజు
గానం:- బాలు

peddavIdhi chinnavIdhi irukuvIdhi merakavIdhi
anni veedhulu oorivErA
poTTivADu poDuguvADu unnavADu lEnivADu
anni roopulu manishivErA
ooriooriki bEdhamundirA
manishimanishikO marmamundirA
aachitoochi ee jagAna aDugu munduku vEyyarA

kashTamocchinA nashTamocchinA chediripOnidi ee bandhamEnurA
rechagoTTinA racchakeeDchinA bediripOnidi ee snEhamEnurA
chinnanavvutO lokAnni geluchukO
unnadAnitO swargAnni malachukO
kalimilO pongaku lEmilO kungaku
bhAyi
ninnuganna ooripEru marachipOku nEstamA

manasu nammina mArgamenchukO
mukkusooTigA sAgipOrA
mAya addamE paaDulokamu
munduchooputo masalukorA
poolatOTalO vishanAgulunDavA?
lELLachentanE toDELLu undava?
piDugulE raalinA aDugulE sAgani
bhAyi
laksha muLLakanTE oka puvvu mElu mitramA

sinimA:- vAlujaDa tOlubelTu
saahityam:- bhuvanachandra
sangeetam:- prasanna sarrAju
gAnam:- bAlu

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]