Friday, April 1, 2011

 
సూర్యుడు చూస్తున్నాడు
చంద్రుడు వింటున్నాడు
నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు
వాడు నీవాడు
నేడు రేపు ఏనాడు

ఆ: నిన్ను ఎలా నమ్మను?
అ: ఎలా నమ్మించను?

అ:
ప్రేమకు పునాది నమ్మకము
అది నదీసాగర సంగమము
ఆ:
కడలికి ఎన్నో నదుల బంధము
మనిషికి ఒకటే హృదయము
అ:
అది వెలిగించని ప్రమిధలాంటిది
వలచినప్పుడే వెలిగేది
ఆ: వెలిగిందా మరి?
అ: వలచవా మరి?
ఆ:
ఎదలొ ఎదొ మెదిలింది
అది ప్రేమని నేడే తెలిసింది

అ: వింటున్నవా?
ఆ: ఏమి వినమంటావ్?

ఆ:
మనసుకు భాషే లేదన్నారు
మరి ఎవరి మాటలను వినమంటావు?
అ:
మనసు మూగగా వినబడుతుంది
అది విన్నవాళ్ళకే బాసవుతుంది
ఆ:
అది పలికించని వీణవంటిది
మీటినప్పుడే పాటవుతుంది
అ: మీటేది ఎవ్వరని?
ఆ: పాడేదేమని?
అ:
మాటా మనసు ఒక్కటని
మారని చెరగని సత్యమని

సినిమా:- అభిమన్యుడు
సాహిత్యం:- ఆత్రేయ
సంగీతం:- మహదేవన్
గానం:- బాలు, సుశీల


sooryuDu choostunnADu
chandruDu vinTunnADu
neevu nammanivADu nijamu chebutunnADu
vADu neevADu
nEDu rEpu EnADu

A: ninnu elA nammanu?
a: elA namminchanu?

a:
prEmaku punAdi nammakamu
adi nadIsaagara sangamamu
A:
kaDaliki ennO nadula bandhamu
manishiki okaTE hRdayamu
a:
adi veliginchani pramidhalAnTidi
valachinappuDE veligEdi
A: veligindA mari?
a: valachavA mari?
A:
edalo edo medilindi
adi prEmani nEDE telisindi

a: vinTunnaVA?
A: Emi vinamanTAv?

A:
manasuku bhAshE lEdannAru
mari evari mATalanu vinamanTAvu?
a:
manasu moogagA vinabaDutundi
adi vinnavALLakE baasavutundi
A:
adi palikinchani veeNavanTidi
meeTinappuDE pATavutundi
a: meeTEdi evvarani?
A: pADEdEmani?
a:
mATA manasu okkaTani
mArani cheragani satyamani

sinimaa:- abhimanyuDu
saahityam:- AtrEya
sangeetam:- mahadEvan
gAnam:- bAlu, suSeela

Labels: , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]