Saturday, January 28, 2012

 
"నీలాసుందరి పరిణయం" అనే కావ్యంలో
"కూచిమచి తిమ్మకవి"
మొదటగా చేసిన శివస్తుతి

శ్రీ అనే అక్షరం తప్పించి (ఎందుకంటే ఎదైనా కావ్యం "శ్రీ" అనే అక్షరంతో మొదలు పెట్టడం సాంప్రదాయం) ఈ కవ్యం మొత్తం అచ్చమైన తెలుగు పదాలతోనే రచించడం జరిగింది
మచ్చుకి మొదటి రెండు పద్యాలు


శ్రీలకు తానకంబగుచు, చెన్నె లలరారెడి వెండికొండపై
మెలికదానె డాలు హొయెలు మీరెడి జాబిలి రాల మెడలో
వెలుపురేడు నల్వయను వెన్నుడు కొల్వగ
మంచుకొండ రాచూలుని కూడి
వెడుకల చొక్కెడు లే నెలతాల్పు కొల్చెదన్

శ్రీలకు = ఇశ్వర్యాలకు
తానకంబు = నివాసభూమి
వెండికొండపై = కైలాసముపై
వెలుపురేడు = ఇంద్రుడు
నల్వయను = బ్రహ్మ
వెన్నుడు = విష్ణు
కొల్వగా = కొల్చుకుంటుంటే
మంచుకొంద
రాజు = హిమవంతుండు
చూలు = కూతురు (పార్వతిదేవి)
వేడుకల
చొక్కెడు = దానితో ఆనందముగా ప్రకాశిస్తున్నటి
లే = లేత
నెల = చంద్రుడు
తాల్పు = ధరించిన
కొల్చెదన్ = పూజించుట

ఇశ్వర్యాలకు నిలయమైన కైలాసముపై, ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు కొలుచుకుంటున్న, చంద్రుడిని తలపై ధరించిన పార్వతిదేవి సహితుడైన శివుని నే పూజిస్తున్నను


ఈ కావ్యాన్ని శివుడి అంకితమిస్తూ, ఎలాంటి శివుడికి అంటే

మత్తగిల్లు సత్తు గిత్త తత్తడినెక్కి
మిత్తి మొత్తి
సత్తి నత్తి
బత్తి పత్తిరిడిన
బుత్తిముత్తులు రెండును
ఒత్తి గుత్తకట్టుచుండు రేడు

మత్తగిల్లు = బాగా మధించిన
సత్తు గిత్త = సత్తువు కలిగిన ఎద్దు
తత్తడి = గుర్రం (వాహనం)
ఎక్కి = (వృషభ వాహనం) ఎక్కి
మిత్తి = మృత్యువు
మొత్తి = నశింపచేసి
సత్తి = శక్తి (పార్వతిదేవి)
నత్తి = హత్తుకొని
బత్తి = భక్తితో
పత్తిరిడిన = పత్తినిగాని ఇస్తే
బుత్తిముత్తి = భుక్తి, ముక్తులు రెండును
ఒత్తి
గుత్తకట్టుచుండు
రేడు = ప్రేమగా అందించే దేవర

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]