Monday, January 30, 2012

 
కృష్ణా...
కొండంత దేవుడవు నీవు
గోరంత దీపాన్ని నేను
దీపాలకు దీపమే నువ్వు
అందుకే నా దైవమైనావు

నిన్ను చూడాలని కన్నులే చూపులై
చూడలేక కన్నీటి చుక్కలై
యమునగా పొంగినా..పదములే కడిగినా
నిరుపేద హారతి నీవందుకోవా
నీ ఆలయ జ్యోతిగా నను చేసుకోవా

ఈ దీపమింక వెలిగేది ఎన్నాళ్ళో
నీ రూపమింక చూసేది ఎన్నడో
దీపమై వెలిగినా..నీడనై మిగిలినా
వెలిగేది నీ కాంతి రూపం
మిగిలేది కన్నయ్యా నీ నీలి వర్ణం

సినిమా:- ?????
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- చక్రవర్తి
గానం: సుశీల, శైలజ

kRshNA...
konDanta dEvuDavu nIvu
gOranta deepaanni nEnu
deepAlaku deepamE nuvvu
andukE naa daivamainAvu

ninnu chooDaalani kannulE choopulai
chooDalEka kannITi chukkalai
yamunagA ponginA..padamulE kaDiginA
nirupEda haarati neevandukOvA
nee aalaya jyOtigA nanu chEsukOvA

ee deepaminka veligEdi ennALLO
nee roopaminka choosEdi ennaDO
deepamai veliginA..neeDanai migilinA
veligEdi nee kaanti roopam
migilEdi kannayyA nee neeli varNam

sinimaa:- ?????
saahityam:- vETUri
sangeetam:- chakravarti
gAnam: suSeela, Sailaja

Labels: , ,


Comments:
నిండు నూరేళ్ళ సినిమా
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]