Monday, January 30, 2012

 
హెచ్చరిక..హెచ్చరిక..హెచ్చరిక..
హెచ్చరిక..హెచ్చరిక..అందరికీ హెచ్చరిక
ముందు దగా..వెనుక దగా..గుర్తించమనే హెచ్చరిక
అగ్నిపరీక్ష సమయం..ఇది అకాల సుర్యాస్తమయం
నలుదిక్కులను నలుపెక్కిస్తూ కమ్ముకు వచ్చిన గ్రహణం
పట్టపగలే నడిరాత్రిగా మార్చిన చిక్కుల చీకటి వలయం
భద్రంగానే ఉన్నానని భ్రమ వదలని భారతమా
గద్ద గూటిలో నిద్దురపోయే శాంతి కపోతమా

మొన్నటి వరకు కనిపించాడు శత్రువు తెల్లవాడు గనక
అప్పటినుంచి ముసిరింది కీడు నల్లని ముసుగుల వెనుక
కులాల, జాతుల, మతాల నేతల కుమ్ములాటలొక వంక
అగ్గివాగులై, వ్యఘ్రనాగులై ఉగ్రవాదులొక వంక
ఆరలేదు ఇంకా భారత స్వరాజ్య సమరపు అగ్గిసెగ
చేరలేదు ఇంకా జాతికి సురాజ్య శాంతుల శుభలేఖ
పొలిమేరల్లో పొంచిఉన్న పగవారికి హెచ్చరిక
పులికోరల్లో పురుడోసుకొనే పిచ్చి ప్రగతికి హెచ్చరిక


ఆయువునిచ్చే ప్రాణవాయువుకి లేదే ఏ కులము
ఆపదనుంచి కాపాడొద్దని చెప్పదు ఏ మతము
ఊపిరి పోసే సంకల్పాన్ని ఆపదు ఏ ధర్మం
సాయం చేసే సాహసాన్ని ఎదిరిస్తే నేరం
కులమతాలకన్నా ముందు మనుషులుగా జన్మించాం
ఆ బంధంలో మనమంతా ఓ తల్లి సంతానం
విద్వేషాల విషాన్ని చింపే తక్షకులకు ఈ హెచ్చరిక
లక్షల కత్తులు దించి చెలిమితో అల్లిన చేతుల హెచ్చరిక

రాం రహీంల భేధం చెరిపి
ఖురాన్, గీతల స్వరాలు కలిపి
మతం కన్న జనహితం మిన్న..అని చాటిన బలిదానం
మృత్యువు మోయలేని ఈ పసిప్రాణం
కలత నిదురలో ఉలికిపడ్డ కన్నతల్లి గుండెల్ల ఘోష
గర్భ శొకమై, గర్వ స్లోకమై అరిపిస్తున్నది వీర వందనం
చరిత్ర సైతం చలించిపోయే ఈ త్యాగమే ఓ హెచ్చరిక
ఇలాంటి సంస్కృతి పునాదిగాగల అనాది గాధల హెచ్చరిక

సినిమా:- భారతరత్న
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- వందేమాతరం శ్రీనివాస్
గానం:- బాలు

heccharika..heccharika..heccharika..
heccharika..heccharika..andarikI heccharika
mundu dagA..venuka dagA..gurtinchamanE heccharika
agniparIksha samayam..idi akaala suryaastamayam
naludikkulanu nalupekkistU kammuku vacchina grahaNam
paTTapagalE naDiraatrigaa maarchina chikkula cheekaTi valayam
bhadramgaanE unnaanani bhrama vadalani bhaaratamaa
gadda gooTilO niddurapOyE Saanti kapOtamaa

monnaTi varaku kanipinchADu Satruvu tellavADu ganaka
appaTinunchi musirindi keeDu nallani musugula venuka
kulaala, jaatula, mataala nEtala kummulaaTaloka vanka
aggivaagulai, vyaGranaagulai ugravaaduloka vanka
aaralEdu inkaa bhaarata swaraajya samarapu aggisega
chEralEdu inkaa jaatiki suraajya Saantula SubhalEkha
polimErallO ponchiunna pagavaariki heccharika
pulikOrallO puruDOsukonE picchi pragatiki heccharika


aayuvunicchE praaNavaayuvuki lEdE E kulamu
aapadanunchi kaapaaDoddani cheppadu E matamu
oopiri pOsE sankalpaanni aapadu E dharmam
saayam chEsE saahasaanni ediristE nEram
kulamataalakannaa mundu manushulugaa janminchaam
aa bandhamlO manamantaa O talli santaanam
vidvEshaala vishaanni chimpE takshakulaku ee heccharika
lakshala kattulu dinchi chelimitO allina chEtula heccharika

raam raheemla bhEdham cheripi
khuraan, gItala swaraalu kalipi
matam kanna janahitam minna..ani chaaTina balidaanam
mRtyuvu mOyalEni ee pasipraaNam
kalata niduralO ulikipaDDa kannatalli gunDella ghOsha
garbha Sokamai, garva slOkamai aripistunnadi veera vandanam
charitra saitam chalinchipOyE ee tyAgamE O heccharika
ilaanTi samskRti punaadigaagala anaadi gaadhala heccharika

sinimaa:- bhaarataratna
saahityam:- sirivennela
sangeetam:- vandEmaataram SrInivaas
gaanam:- bAlu

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]