Monday, January 30, 2012

 
దారి ఉంటేనే మరో దారి పుడుతుంది
ఒక దారి ఉంటేనే మరో దారి పుడుతుంది
ఒక అడుగు వేస్తేనే మరో అడుగు పడుతుంది
గమనం వేరైనా, గమ్యం ఒకటేనా
దిక్కులు మారినా, ధ్యేయం ఒకటేనా
ఓ మనిషి తిరిగి చూడు
ఓ మనిషి తిరిగి చూడు
ఎందరున్నారో, నీలా ఇంకెందరున్నారో
ఎక్కడున్నారో, ఏమౌతున్నారో

తొలి కోడి కూయగానే తెల్లవారిపోదు
వాన కురియగానే చేను పండిపోదు
ఇది వెలుతురులాంటి బ్రాంతి
తుఫాను ముందటి ప్రశాంతి

చెట్టు వాడిపోయింది, వట్టి మోడు మిగిలింది
కొమ్మలన్ని విరిగిపోగా, పళ్ళన్ని చెదిరిపోగా
ఉన్నాను, ఉన్నాను, ఇంకా బ్రతికున్నాను
ఇంకా బ్రతికున్ననని
పడిపోక, నిలబడలేక, చెట్టు బావురుమంటున్నది
తన చుట్టూ చితికిల బ్రతుకులు చూడమంటున్నది

వెట్టి చాకిరికి సంకెళ్ళు
దురంతాలకు తుదినాలు

సినిమా:- ఓ మనిషి తిరిగి చూడు
గానం:- బాలు

daari unTEnE marO daari puDutundi
oka daari unTEnE marO daari puDutundi
oka aDugu vEstEnE marO aDugu paDutundi
gamanam vErainaa, gamyam okaTEnA
dikkulu maarinA, dhyEyam okaTEnA
O manishi tirigi chooDu
O manishi tirigi chooDu
endarunnArO, neelA inkendarunnArO
ekkaDunnArO, EmoutunnArO

toli kODi kooyagAnE tellavAripOdu
vaana kuriyagAnE chEnu panDipOdu
idi veluturulAnTi braanti
tuphaanu mundaTi praSaanti

cheTTu vaaDipOyindi, vaTTi mODu migilindi
kommalanni virigipOgA, paLLanni chediripOgA
unnaanu, unnaanu, inkA bratikunnaanu
inkA bratikunnanani
paDipOka, nilabaDalEka, cheTTu baavurumanTunnadi
tana chuTTU chitikila bratukulu chooDamanTunnadi

veTTi chaakiriki sankeLLu
durantaalaku tudinAlu

sinimaa:- O manishi tirigi chooDu
gaanam:- bAlu

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]