Thursday, July 25, 2013

 

సాగే నది కోసం సాగర సంగీతం

సాగే నది కోసం సాగర సంగీతం
కలిసే నది కోసం కడలే నీ గీతం
సిరివెన్నెలమ్మ కోనలోన వెన్నెల
చిరునవ్వులమ్మ కూతురైన కన్నెలా

ఏదలో ఆరటాలే..పడిలేచే కెరటాలై
కలిశే బులపాటలే..తొలి మోమాటలై
సాగరాల ఘోషలే విని సాగే వాగు వంక
చిలుక గోరువంక గూడుకట్టే గుండెలోన
జల్లుమనే మది పల్లవిగా మనమల్లుకోనే ఈ వేళ
కొత్త కద్దరంచు చీర నేను కట్టగా
తొలి అద్దకాల ముద్దు నేను పెట్టగా

వచ్చే వలపు వసంతం..నులి వెచ్చని తేనెలతో
మెరిసే శ్రావణ మేఘం..తనివి తీరని దాహంతో
కన్నెవలపు కోడిపులుపు కలిసే కౌగిలింత
అలకే తీరి పులకే పూత కొచ్చే వేళలోన
ఆ గతమే నా స్వాగతమై..ఈ జీవితమే నీదైతే
తొలి తూరుపింటి లేత ఎండ బొట్టుగా
చుక్క దీపమెట్టు వేళ ముద్దు పెట్టగా

సాహిత్యం:- వేటూరి
సంగీతం:- కృష్ణ చక్ర
గానం:- బాలు, సుశీల



saagE nadi kOsam saagara sangeetam
kalisE nadi kOsam kaDalE nee geetam
sirivennelamma kOnalOna vennela
chirunavvulamma kooturaina kannelA

EdalO aaraTaalE..paDilEchE keraTaalai
kaliSE bulapaaTalE..toli mOmaaTalai
saagaraala ghOshalE vini saagE vaagu vanka
chiluka gOruvanka gooDukaTTE gunDelOna
jallumanE madi pallavigA manamallukOnE ee vELa
kotta kaddaranchu cheera nEnu kaTTagA
toli addakaala muddu nEnu peTTagA

vacchE valapu vasantam..nuli vecchani tEnelatO
merisE SraavaNa mEgham..tanivi teerani daahamtO
kannevalapu kODipulupu kalisE kougilinta
alakE teeri pulakE poota kocchE vELalOna
aa gatamE naa swaagatamai..ee jeevitamE needaitE
toli toorupinTi lEta enDa boTTugA
chukka deepameTTu vELa muddu peTTagA

saahityam:- vETUri
sangeetam:- kRshNa chakra
gaanam:- baalu, suSeela

Labels: , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]