Thursday, July 25, 2013

 
మాయదారి లోకంలో మమతలూరు
మంచితనానికే మరో పేరు వాళ్ళ ఊరు
తాతలు ఇచ్చిన ఆస్తి ఇదెకరాలు
ఎంత మనిషికైనా ఎడు అడుగులు చాలు
అనగనగా ఇదో రాజు కధ..మారాజు కధ..సుబ్బరాజు కధ

పుట్టాడు ఒక సుపుత్రుడు లేక లేక
చదివించారు వాడ్ని డిగ్రీ దాక
చదువొచ్చిన మారాజని సంతసమాయె
వాడొస్తే ఇల్లంతా సంబరమాయె
సుబ్బరాజు కొడుకంటే సూర్యుడంత వెలుగు
వాడ్ని చూసి కన్న తల్లి వెన్నలాగ కరుగు
ఒక చెత్తో ఉద్యోగం సంపాదించి
రెండు చేతులా డభ్భులు సంపాదించే కోడుకు వాళ్ళకు ఉన్నాడని సంతోషించారు
రాచిలకతోటి సంబంధం ఖాయం చేసారు

అనగనగా ఇదో రాజు కధ..మారాజు కధ..సుబ్బరాజు కధ

కొత్త దంపతుల షికార్లు అర్ధరాత్రి వరకు
కునుకు లేదు పెద్దొళ్ళకు కోడికూత వరకు
అత్తగారు మామగారు వస్తే ఇక సరేసరి
ఎత్తిపొడుపులు ఆపై వెట్టిచాకిరి
పాల కరువు, నీళ్ళ కరువు, ప్రేమ కరువు పట్నంలో
కన్నవారిపై దయ జాలి కలుగు నరకంలో
పున్నామ నరకంలో ఎన్నాళ్ళని ఉండగలరు అక్కడ వాళ్ళు
కన్నీళ్ళను మింగుతూ అక్కడ వాళ్ళు
కాలుతున్న కొవ్వోత్తిగా కన్నతల్లి మారింది
ఆమె బాధ చూసి కన్నతండ్రి శిలగా మారేడు
కొడుకుగారి నిర్వాకం..తల్లి అనారోగ్యం
మందుకైన చిల్లిగవ్వ లేక తండ్రికి వైరాగ్యం

అనగనగా ఇదో రాజు కధ..మారాజు కధ..సుబ్బరాజు కధ

చచ్చినాక తలకొరువులు పెడతారట కొడుకులు
కొందరు బ్రతికుండగానే చితిపేర్చే కొరువులు
సాటిమనిషిగా చూస్తే చాలన్నాడు
సానుభూతిలేని బ్రతుకు చావన్నాడు
అమ్మ పేరు అనాధ..నాన్న ఊరు నడివీధి
అనాధాశ్రమానికే నడిపించెను దుర్విధి
కన్న కొడుకు తీర్చెను ఇలా కన్నవారి ఋణము
కడుపున సుడి తిరిగెను కన్నీటి కడలి జలము

చిత్రం:- సుబ్బరాజుగారి కుటుంబం
సాహిత్యం:- వేటురి
సంగీతం:- కీరవాణి
గానం:- కీరవాణి  

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]