Thursday, July 25, 2013

 

వెయ్యిరా ముందడుగు

వెయ్యిరా ముందడుగు ఘరాన వీరుడిలా
జయమే సాధించు జగాన ధీరుడిలా
నీదే గెలుపని, నీతి నమ్ముకొని జీవితాన సాగిపొమ్మురా
నీది మజిలిలేని పయనమురా

బాధలు పొంగే కష్టములోను..ఎన్నడు కలతే చెందకురా
పడమరే కుంగే పొద్దులలోను..వెన్నెల ఆశలు వీడకురా
ధర్యముంటే నీలోన..ఏది అడ్డు రాబోదు
తలచుకుంటే లోకాన..కానిదంటు లేదు
మదికే చెడునా ఎదురైతే
మరలా రాసేయి విధిరాతే

నీ ప్రతి మాట..నిలిచే దాక..నీవిక నిదురే పోకుమురా
నీ ప్రతి చేత..పదుగురి నోట..మెప్పును పొందిన చాలునురా
దేనిలోన నీకెవ్వరు..సాటిలేరనిపించు
మనసులోని మమతలతో..మానవతను పెంచు
నిజమే పలికే నీ కోసం
ఇలకే దిగడా ఆ దైవం

సాహిత్యం:- సాహితి
గానం:- చిత్ర

veyyirA mundaDugu gharaana veeruDilA
jayamE saadhinchu jagaana dheeruDilA
needE gelupani, neeti nammukoni jeevitaana saagipommurA
needi majililEni payanamurA

baadhalu pongE kashTamulOnu..ennaDu kalatE chendakurA
paDamarE kungE poddulalOnu..vennela aaSalu veeDakurA
dharyamunTE neelOna..Edi aDDu raabOdu
talachukunTE lOkAna..kAnidanTu lEdu
madikE cheDunA eduraitE
maralA raasEyi vidhiraatE

nee prati mATa..nilichE daaka..neevika nidurE pOkumurA
nee prati chEta..paduguri nOTa..meppunu pondina chaalunurA
dEnilOna neekevvaru..saaTilEranipinchu
manasulOni mamatalatO..maanavatanu penchu
nijamE palikE nee kOsam
ilakE digaDA aa daivam

saahityam:- saahiti
gaanam:- chitra

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]