Thursday, July 25, 2013

 
Do love Mother India

You too love India

జనని, జన్మభూమిని స్వర్గమన్నదొక కవికులం
ఎది అది ఎక్కడో వెతకమంటున్నది గురుకులం
గుండె పిండుకొని దాగిన గుక్కెడు పాలగులుకులేనెప్పుడు
పోత పాలసీసాల కోసమై పరుగలాటలే ఎపుడూ


అకాశంలో ఆ సుర్యుడొక్కడే
అభ్యుదయంలో నా దేశమొక్కటే
ఆ సుర్యుడెప్పుడూ తూరుపు దిక్కునే ఎందుకు పుడతాడు
కళ్యాణ తిలకమై కన్న తల్లి వడిలోనే ఉంటాడు
అలంటిదేరా నా భారతదేశం
సనాతనంలో సమిష్ఠి దేశం
ఆ సనాతనంలో గల పునాదిలోనే సంకరమవుతుంటే
నా అభ్యుదయానికి సభ్యసమాజమే సమాధి కడుతుంటే
తరతారల దాస్యం తెంచుకున్న ఈ స్వరాజ్య దేశంలో
యువతరాలు మళ్ళీ పరాయి బిక్షకు పరుగులు తగునా

I Love my India
Lovely Mother India
You too love India
Do love Mother India

పరాయిదేశంలో కిరాయి కోసమని
స్వదేశజ్ఞానం సవారి కడుతుంటే
ఆ కూలి దబ్బు డాలర్లలోనే సుఖజీవనముందంటే
ఆ పాలిగాపు నీ పాలి శ్రతువై తిరిగి వెళ్ళమంటే
కడుపుతీపికే కన్నీటి రోదనై
కన్నతండ్రికే అది మూగ వేదనై
ఆ నారుపోసి నీరెత్తినొళ్ళకు ఫలితం ఏముంది
ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు ప్రతిష్ఠ ఏముంది
ఆ కీర్తిప్రతిష్ఠల హిమాలయాన్నే సిగలో ముడిచిన తల్లికి
దురాగతాల అలంకారులు చేయుట న్యాయమా..ధర్మమా

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]