Monday, April 23, 2018

 
పాప పుట్టినరోజు
కనుపాప వెలిగిన రోజు
దీవించని పది నోళ్ళు
జీవించమని నూరేళ్ళు

మా దీవెనలన్ని పండాలి
నువ్వు చల్లగ నూరేళ్ళు ఉండాలి

చిన్నతనం కన్నెతనం తెలియకనే గడిచేది
ఆలితనం అమ్మతనం ప్రశ్నలుగా మిగిలేది
అన్నింటా పెద్దతనం నీకే దక్కాలి
పెద్దయినా  పసితనమే నీ నవ్వున మిగలాలి


పుట్టుకతో ఎవ్వరికీ గొప్పతనం రాదమ్మా
ఊరకనే ఈ లొకం పేరు చెప్పుకోదమ్మా
నీ పేరు చెప్పుకోదమ్మా
తమకోసం బ్రతికేవారు నలుగురిలో ఒకరు
నలుగురికై బ్రతికేవారు కొటికొకరే ఒక్కరు

paapa puTTinarOju
kanupaapa veligina rOju
deevinchani padi nOLLu
jeevinchamani noorELLu

maa deevenalanni panDaali
nuvvu challaga noorELLu unDaali

chinnatanam kannetanam teliyakanE gaDichEdi
aalitanam ammatanam praSnalugA migilEdi
anninTA peddatanam neekE dakkaali
peddayinA  pasitanamE nee navvuna migalaali


puTTukatO evvarikI goppatanam raadammaa
oorakanE ee lokam pEru cheppukOdammaa
nee pEru cheppukOdammaa
tamakOsam bratikEvaaru nalugurilO okaru
nalugurikai bratikEvaaru koTikokarE okkaru

గానం:- పి. సుశీల
సినిమా:- తాగుబోతులు



Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]